క్రాక్ హీరో ఫ్యామిలీ మాన్ అయిపోయాడుగా

క్రాక్ హీరో ఫ్యామిలీ మాన్ అయిపోయాడుగా

Published on Jan 15, 2020 8:30 AM IST

రవి తేజ పోలీస్ గా నటిస్తున్న చిత్రం క్రాక్. దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరు కలిసి చేసిన డాన్ శ్రీను, బలుపు హిట్ మూవీస్ గా నిలిచాయి. నిన్న భోగి పండుగ సంధర్భంగా క్రాక్ చిత్రంలోని ఓ పోస్టర్ విడుదల చేశారు. పండుగ బట్టలలో, పిండి వంటలతో బుల్లెట్ బండి పై వెళుతున్న రవితేజ, శృతి హాసన్ లుక్ నిజంగా పండుగలా ఉంది. బుల్లెట్ శృతి హాసన్ నడుపుతుండగా వెనుక రవితేజ కూర్చోవడం ఆసక్తిని రేపుతోంది. అలాగే బండిపై ఓ పదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. దీనితో రవి తేజ ఈ చిత్రంలో ఫ్యామిలీ మెన్ రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. రవి తేజ కూడా వయసుకు దగ్గట్టుగా పాత్రల ఎంచుకుంటున్నాడు అనిపిస్తుంది.

ఇక రవి తేజ లేటెస్ట్ మూవీ డిస్కో రాజా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 24న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. దర్శకుడు వి ఐ ఆనంద్ ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించారు . ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. వర్సిటైల్ యాక్టర్ బాబీ సింహ విలన్ రోల్ చేస్తున్నారు.

తాజా వార్తలు