‘అవును’ రవిబాబుకి మంచి లాభాన్ని తెచ్చి పెట్టింది.!

‘అవును’ రవిబాబుకి మంచి లాభాన్ని తెచ్చి పెట్టింది.!

Published on Sep 24, 2012 12:51 PM IST

సరికొత్త కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన వారందరూ సినిమాని చాలా బాగా తీసారని రవిబాబు పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే డైరెక్టర్ రవిబాబుకి ఈ చిత్రం మంచి లాభాన్ని ఇచ్చింది.

రవిబాబు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ చిత్రాన్ని సుమారు 45 లక్షల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ సినిమా చూసి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సుమారు 3 కోట్ల 60 లక్షలకు ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు, దీన్ని బట్టి చూస్తే సినిమా విడుదలకి ముందే రవిబాబుకి మంచి లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ప్రసాద్ వి. పొట్లూరి కూడా ఈ చిత్రంలో భాగస్వాములయ్యారు.

బాక్స్ ఆఫీసు వద్ద ‘అవును’ కి వచ్చిన మంచి స్పందనతో డి. సురేష్ బాబుకి మరియు పి.వి.పి సినిమా వారు పెట్టిన ఖర్చుకి తగ్గ ఫలితం వస్తోందని సంతోషంగా ఉన్నారు.

తాజా వార్తలు