సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న రాశి

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న రాశి

Published on Jun 29, 2012 3:13 PM IST


సుమారు దశాబ్ద కాలం పాటు తన నటన మరియు అందచందాలతో యువకుల మనసును గెలుచుకున్న అందాల నటి రాశి. 2004లో పెళ్లి చేసుకొని తెరకు దూరమైన రాశి, తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాశి మాట్లాడుతూ ‘ గతంలో తెలుగు చలన చిత్ర రంగంలో తన నటన ద్వారా మహిళా ప్రేక్షకులు మరియు యువత తనని బాగా ఆదరించారని అన్నారు. ఇటీవలే ఒక ప్రముఖ నిర్మాత అనుకోకుండా కలిసి మళ్ళీ సినిమాల్లో నటించవచ్చు కదా అని అడిగారు. నేను కూడా నా అభిమానుల కోసం మళ్ళీ నటించాలని అనుకుంటున్నాను. నా కెరీర్లో చాలా రకాల పాత్రలు చేశాను కానీ నా డ్రీమ్ రోల్ పాత్ర ఇప్పటివరకు చెయ్యలేదని, నా సెకండ్ ఇన్నింగ్స్ ని నా డ్రీమ్ రోల్ పాత్రతో ఎంట్రీ ఇవ్వనుండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకు మంచి గుర్తింపునిచ్చే సినిమాలను తీసిన ఈవీవీ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ప్రస్తుతం ‘లక్కు-కిక్కు’ అనే ఒక టీవి షో చేశానన్నారు. తన రాబోయే చిత్రం గురించి త్వరలోనే ఆ చిత్ర నిర్మాతలు పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు’.

గతంలో రాశిని కథానాయికగా ఆదరించిన అబిమానులు తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ఆదరిస్తారని ఆశిద్దాం. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రాశికి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు