అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?

అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?

Published on Aug 26, 2025 11:57 AM IST

Mass-Jathara

మన టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “మాస్ జాతర”. డీసెంట్ బజ్ ని మొదట్లో అందుకున్న ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ ఈ ఆగస్ట్ 27న థియేటర్స్ లో రిలీజ్ కి రావాల్సి ఉంది. కానీ ఈ డేట్ లో కూడా రావడం లేదని మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా వాయిదాని ఖరారు చేశారు.

ఈ మధ్యలోనే తెలుగు సినిమా దగ్గర జరిగిన స్ట్రైక్ కారణంగా సినిమా పనులు ఆలస్యం అయ్యాయి అని అందుకే వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ఏంటి ఎప్పుడు అనేది మాత్రం త్వరలో అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్ స్లాట్ మొత్తం ఫుల్ అయ్యి ఉంది సో అక్టోబర్ లో సినిమా వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు