నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?

నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?

Published on Aug 26, 2025 7:59 AM IST

og

మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్ గా రాబోతున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి” అనే చెప్పాలి. దీనిపై ఉన్న హైప్ ఏ రేంజ్ అనేది రిలీజ్ రోజు వచ్చే వసూళ్లతోనే క్లియర్ అవుతుంది.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ ని చేయగా ఇపుడు నైజాం మార్కెట్ కి సంబంధించి సాలిడ్ న్యూస్ వినిపిస్తుంది. దీని ప్రకారం నైజాం మార్కెట్ లో ఓజి రిలీజ్ చేయానికి ఓజి ప్రొడ్యూసర్ దిల్ రాజు లాక్ అయినట్టు తెలుస్తుంది. తాను భారీ ధర వెచ్చించి ఓజి హక్కులు కొనుగోలు చేశారట. దీనితో తన అండర్ లో అయితే ఈ భారీ సినిమా విడుదల కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు