ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశారు..!

ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశారు..!

Published on Aug 26, 2025 12:00 AM IST

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ రిలీజ్‌కు రెడీ అయింది. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత రాజీవ్ రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘ఘాటి’ జర్నీ ఎలా మొదలైంది..?

ఒక ఫిమేల్ సూపర్ స్టార్ తో కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనేది మెయిన్ ఐడియా. కర్తవ్యం తర్వాత ఆ స్కేల్‌లో మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్ లో అనుష్క గారికి అలాంటి స్టార్డం ఉంది. క్రిష్ గారు అనుష్క గారితో ఒక ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఘాటి స్టార్ట్ అయింది. అరకు, గాంజా బ్యాక్ డ్రాప్ లో ఒక కథ చేయాలనుకున్నాం. అయితే అది సినిమాగా చేయాలా వెబ్ సిరీస్ గా చేయాలని డిస్కషన్ ఉండేది. ఫైనల్ గా అనుష్క గారితో సబ్జెక్టుని అనుకున్న తర్వాత మూవీ వర్క్ చేయడం మొదలుపెట్టాం.

అనుష్క పాత్ర ఎలా ఉండబోతుంది..?

ట్రైలర్‌లో కనిపించినంత ఇంటెన్స్ రోల్‌లో ఆమె సినిమాలోనూ కనిపిస్తారు. యాక్షన్‌తో పాటు క్రిష్ మార్క్ డ్రామా ఇందులో ఉంటుంది. అనుష్క పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

ఘాటి చిత్రానికి సీక్వెల్ చేసే ప్లాన్ ఉందా..?

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ఆడియన్స్ అందరూ కలిసి పెద్ద హిట్ చేస్తే అప్పుడు పార్ట్ 2 ఆలోచిస్తాం. అయితే ఈ కథకి పార్ట్ 2 చేసే స్కోప్ ఉంది.

ఈ సినిమా మ్యూజిక్ గురించి..?

సాగర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. క్రిష్ ఎడిటింగ్, మ్యూజిక్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వరు.

మీ తదుపరి ప్రాజెక్టులు ఏమిటి..?

వరుణ్ తేజ్‌తో హారర్ కామెడీ చేస్తున్నాం.. అది 80% షూట్ పూర్తయింది. అలాగే ‘అరేబియన్ కడలి సీజన్ 2’, అమెజాన్ ప్రైమ్ కోసం ఓ ఒరిజినల్ ఫిల్మ్ ప్లాన్‌ చేస్తున్నాం.

తాజా వార్తలు