ముగించేసింది.. రష్మిక ఆనందానికి అవధుల్లేవు

హీరోయిన్ రష్మిక మందన్న తెలుగులో స్టార్ కథానాయకిగా కొనసాగుతూనే తమిళ పరిశ్రమ మీద కూడ దృష్టి పెట్టింది. తమిళంలో ఆమె సైన్ చేసిన మొదటి సినిమా ‘సుల్తాన్’. స్టార్ హీరో కార్తీ నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నారు. లాక్ డౌన్ ముందే చాలా భాగం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఈమధ్యే చివరి షెడ్యూల్ మొదలుపెట్టి ఇవాల్టితో ముగించింది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. తమిళంలో ఇదే తన మొదటి ప్రాజెక్ట్ కావడంతో రష్మిక చాలా సంతోషంగా ఉంది.

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్. కార్తీ చేసిన అన్ని చిత్రాల్లోకి ఈ చిత్రమే బెస్ట్ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది. లాక్ డౌన్ విరామంలో పూర్తైన చిత్రీకరణ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగియడంతో చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత కార్తీ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

మూడేళ్లుగా ఊరిస్తున్న ఈ కథ ఎట్టకేలకు చిత్ర రూపం దాల్చిందని కార్తీ సైతం ఎగ్జైట్ అవుతున్నారు.
తెలుగులో కూడ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉండటం రష్మిక మందన్న హీరోయిన్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంతో కొలీవుడ్ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని రష్మిక భావిస్తోంది.

Exit mobile version