అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘పుష్ప’లో తన పాత్ర అద్భుతంగా ఉండబోతుందని.. తన కెరీర్‌లోనే పుష్ప సినిమా ఎప్పటికి నిలిచిపోతుందని.. ప్రధానంగా ఈ సినిమా ద్వారా తన నటనలోని మరో కోణం బయటికి వస్తుందని రష్మిక చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెకెక్కించబోతున్నారు. అందుకే, స్టార్ కాస్ట్ ను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట.
విలన్ గా సునీల్ శెట్టిని ఒప్పించాలని సుకుమార్ అనుకుంటున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.