షూటింగ్ పూర్తి కావచ్చిన కృష్ణం వందే జగద్గురుం

షూటింగ్ పూర్తి కావచ్చిన కృష్ణం వందే జగద్గురుం

Published on Oct 6, 2012 9:44 AM IST

రానా రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో నయనతార మరియు రానా ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో రానా ‘బి.టెక్ బాబు’గా కనిపించనున్నారు. స్టేజ్ ఆర్టిస్ట్ గా ఈ చిత్రంలో రానా నటించారు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఒక డాకుమెంటరీ చిత్రాలను తీసుకొని ఒక అమ్మాయితో పరిచయం అయ్యాక అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అన్నదే ఈ చిత్రం కధాంశం. “కృష్ణం వందే జగద్గురుం చిత్ర చివరి పాట చిత్రీకరణ కోసం సెట్ కి చేరుకున్నాను” అని రానా ట్విట్టర్లో చెప్పారు. మేము గతంలో చెప్పిన విధంగా ఈ చిత్రం కోసం వెంకటేష్ ,రానా మరియు సమీర రెడ్డిల మీద ఒక పాటను చిత్రీకరిచారు. “కృష్ణం వందే జగద్గురుం” చిత్ర ఆడియో అక్టోబర్ 7న విడుదల కానుంది.

తాజా వార్తలు