పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఇది తెలుగు రీమేక్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభమైంది. తొలుత పవన్ కళ్యాణ్ మీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈరోజు నుండి రానా దగ్గుబాటి సైతం షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇక మీదట పవన్, రానా మీద ఫైట్ సీన్స్ కంపోజ్ చేయనున్నారు బృందం. ఇంకొక పది రోజుల వరకు షూటింగ్ హైదరాబాద్లోనే జరగనుంది. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ లాంటి స్టార్ నటులు ఇందులో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ కాగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ప్రకటన కాలేదు. ఇకపోతే ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం.