దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దగ్గుబాటి రానా లతో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “బాహుబలి” సిరీస్ ను ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మరి అలాగే ఈ చిత్రంలో హీరో విలన్ ఇద్దరి పాత్రలను చూపిన విధానం కూడా ఒక సెన్సేషనల్ హీరో అండ్ విలన్ రైవలరీగా నిలిచింది. అయితే మరి దీనికి సంబంధించే సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ నుంచి ఓ టాపిక్ వచ్చింది.
మీ ఫేవరెట్ విలన్ ఒకప్పుడు చెప్పాడు అనే టైప్ లో తమ ఫాలోవర్స్ ను ఒక డైలాగ్ అడిగారు. దానికి రానా బాహుబలిలో తాను చెప్పిన ఓ డైలాగ్ ను రిప్లై ఇచ్చాడు. మరి ఈ సమయంలోనే మళ్ళీ మీ కాంబోను ఎప్పుడు చూడొచ్చు అని ఓ ఫాలోవర్ రానాను అడగ్గా బాహుబలి లోని ప్రభాస్ మరియు తాను కలిపి ఉండే ఓ పవర్ ఫుల్ పోస్టర్ పెట్టి “మళ్ళీ ఈ బొమ్మను మ్యాచ్ అయ్యే కథ ఉన్నప్పుడే” అని చెప్పేసాడు. అంటే మళ్ళీ బాహుబలి రేంజ్ కథ దొరికితే కానీ భళ్లాలుడు బాహుతో కనిపించడని చెప్పాలి.
Ee Bomma ki match ayyaeantha kadha vachinnapudu 😉 pic.twitter.com/OPHU3Q0Oe3
— Rana Daggubati (@RanaDaggubati) February 17, 2021