షూటింగ్లో గాయపడ్డ రానా

షూటింగ్లో గాయపడ్డ రానా

Published on Apr 11, 2012 5:43 PM IST

టాలీవుడ్ యువనటుడు రానా ప్రస్తుతం ‘కృష్ణం వందే జగద్గురుం’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా రానా గాయపడ్డాడు. ఈ చిత్రానికి బ్లాస్ట్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా రానా ఎడమ భుజానికి గాయమైంది. ఆందోళన పడవలిసిందేమి లేదని వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారు. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాగర్లమూడి సాయి బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు