సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవకట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో స్టార్ నటి రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటితో ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ ముగించేశారు. ఈ విషయాన్నే ట్విట్టర్ ద్వారా తెలిపిన దేవకట్ట దేవతతో పనిచేయడం గొప్పగా ఆనందంగా ఉందని, సినిమాలో భాగమైనందుకు రమ్యకృష్ణగారికి కృతజ్ఞతలని చెప్పుకొచ్చారు.
కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో దేవకట్ట చేసిన ‘ప్రస్థానం’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆ తరహాలో రాజకీయాల నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమా కావడంతో ‘రిపబ్లిక్’ మీద మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నారు. ఇందులో అవుశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తుండగా సీనియర్ నటుడు జగపతిబాబు కూడ ఒక కీ రోల్ చేస్తున్నారు. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.