రాజమౌళి ‘బాహుబలి’లో రాజమాతగా రమ్యకృష్ణ

రాజమౌళి ‘బాహుబలి’లో రాజమాతగా రమ్యకృష్ణ

Published on Aug 15, 2013 3:30 PM IST

ramya-krishna

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో మరో నటి రమ్యకృష్ణ కూడా నటిస్తోందని సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్, రానాల తల్లిగా నటించనుందని తెలిసింది. గతంలో ‘అమ్మేరు’ సినిమాలో అమ్మేరు పాత్రలో నటించి అందరిని మెప్పించిన తను రాజసం ఉట్టిపడే ఈ పాత్రకి సరైన న్యాయం చేస్తుందని అందరూ బావిస్తున్నారు.

ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా ఈ సినిమాలో రానా ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. ఆర్క మీడియా బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు