పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక కొత్త సెన్సేషనల్ న్యూస్ చూపించడానికి ఆసక్తి చూపే రిపోర్టర్ గా కనిపించనున్నాడు. ‘ ఈ చిత్రంలో రాంబాబు సెన్సేషనల్ న్యూస్ “రాంబాబు అనే విలేఖరి ఆసక్తి కరమయిన వార్తల కోసం వెతికే పాత్ర ఇది అడవిలోనయిన, ఎక్కడయినా సరే వార్త దొరుకుతుంది అంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు తనతో పాటు గంగ కూడా ఉంటుంది” అని పూరి చెప్పారు. తమన్నా ఈ చిత్రంలో గంగ పాత్రలో కనిపించనుంది. “ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర అభిమానులు ఆశించిన విధంగా ఉంటుంది. ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని పూరి అన్నారు. ఈ మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. దర్శకుడు మరియు నటుడు కలయికలో “బద్రి” తరువాత వస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే “గబ్బర్ సింగ్” చిత్ర విజయంతో ఉత్సాహంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్త విని మరింత ఆనందంగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు.