ఈ రోజు ప్రకటించనున్న ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదల తేది

ఈ రోజు ప్రకటించనున్న ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదల తేది

Published on Sep 30, 2013 2:00 PM IST

ramayya-vasthavayya
యంగ్ టైగర్ ఎన్.టి. ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని దసరాకు విడుదల చేయనున్నారు. దిల్ రాజు, హరీష్ శంకర్ లు ఈ రోజు ప్రెస్ మీట్ లో ఈ సినిమా విడుదల తేదిని తెలియజేయనున్నారు. ఇంతకు ముందు ‘రామయ్యా వస్తావయ్యా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలను దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ‘అత్తారింటికి దారేది’ సినిమాని గత వారం విడుదల చేయడం జరిగింది. దీనితో ఈ సినిమా విడుదలకు మార్గం సుముఖం అయ్యింది. ఎన్. టి. ఆర్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఎన్. టి.ఆర్ స్టైలిష్ గా, ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు