రేపే ‘రామయ్యా వస్తావయ్యా’కి సెన్సార్

రేపే ‘రామయ్యా వస్తావయ్యా’కి సెన్సార్

Published on Oct 6, 2013 2:08 PM IST

Ramayya-Vasthavayya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకి సంబదించిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రేపు ఈ సినిమాని సెన్సార్ సర్తిఫిక్ర్ట్ కోసం సెన్సార్ బోర్డు కి పంపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ దిల్ రాజు మాత్రం ఈ సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటె కొంతమంది ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చినదనే వార్తలని ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజము లేదు. ఎన్.టి.ఆర్ ఇటీవలే ప్రసాద్ లాబ్స్ లో తన డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా విజయం సాధిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాడు. అలాగే దిల్ రాజు లాంటి నిర్మాతతో పనిచేయడం చాలా ఆనదంగా ఉందని అన్నారు.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సంబందించిన విశేషాలను ఎప్పటికప్పుడు మీకందిస్తుంటాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు