ఎన్.టిఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఆడియో ఈ వారంలో విడుదలకానుంది. అయితే ఈ రోజు ఈ సినిమాలో వుండే ఒక పాట మేకింగ్ వీడియోను విడుదలచెయ్యనున్నారు. రాష్ట్ర రాజకీయ నేపధ్యాల నడుమ కొన్ని పెద్ద సినిమాల విడుదలతేదీలని బట్టి ఈ సినిమా విడుదలతేదిని ప్రకటించనున్నారు
ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే నెట్ లో హల చల్ చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తను విన్న హరీష్ తన సినిమాలో పాటలేమి లీక్ అవ్వలేదు అని, నెట్ లో వినిపిస్తున్న పాటలు అభిమానులు చేసినవి అని తెలిపాడు