ఖరారైన తొట్టెంపూడి వేణు ‘రామాచారి’ రిలీజ్ డేట్

ఖరారైన తొట్టెంపూడి వేణు ‘రామాచారి’ రిలీజ్ డేట్

Published on Feb 11, 2013 7:09 PM IST

Ramachari
కామెడీ హీరో వేణు తొట్టెంపూడి నటించిన ‘రామాచారి’ సినిమా ఫైనాన్సియల్ ఇబ్బందుల కారణంగా గత సంవత్సరంగా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమాని మళ్ళ విజయ ప్రసాద్ అండ్ గ్రూప్ వారు తీసుకున్నారు. వారు ఈ సినిమాని మార్చి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వేణు కామెడీ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఈశ్వర్ రెడ్డి డైరెక్టర్.

కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘సిఐడి’ కి రీమేక్. బ్రహ్మానందం, ఎల్.బి శ్రీ రామ్, రఘుబాబు, గిరిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’ లాంటి కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలతో ఆకట్టుకున్న వేణు ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నాడు.

తాజా వార్తలు