చెన్నై పయనమయిన రామ్,తమన్నా

చెన్నై పయనమయిన రామ్,తమన్నా

Published on Apr 14, 2012 11:51 PM IST


రామ్ మరియు తమన్నా “ఏ ఎండ్రాల్ కాదల్ ఎన్బేన్” చిత్ర ఫస్ట్ లుక్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుక ఈ నెల 15న చెన్నై లో జరగనుంది. “ఎందుకంటే ప్రేమంట” చిత్రానికి తమిళ వెర్షన్ అయిన ఈ చిత్రం లోగోను దర్శకులు మురుగదాస్ మరియు లింగు స్వామి ఆవిష్కరిస్తారు ఈ కార్యక్రమానికి స్రవంతి రవి కిషోర్ మరియు కరుణాకరన్ కూడా హాజరవుతున్నారు. “ఎందుకంటే ప్రేమంట” మొదటి ద్విభాషా చిత్రం కాబోతుంది . ఇంతేకాకుండా రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం . తమిళ వెర్షన్ కి కూడా రామ్ తన సొంత గాత్రంతో డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు రామ్ తన బాల్యాన్ని చెన్నైలో గడపటం మూలాన రామ్ కి తమిళ భాష మీద పట్టుంది. తమిళ చిత్ర పండితుల ప్రకారం రామ్ అక్కడ హీరోలకు మంచి పోటి ఇవ్వగలడు. జి.వి.ప్రకాశ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ మే 11 విడుదల అవుతుండగా తమిళ వెర్షన్ జూన్ లో విడుదల కావచ్చు.

తాజా వార్తలు