బీదర్ లో రామ్ “ఎందుకంటే ప్రేమంట”


రామ్, తమన్నా ప్రధాన పాత్రలలో చేస్తున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట” ఈ వేసవి కి విడుదల కావటానికి సిద్దమయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్ర టాకీ భాగం ఇప్పటికే ముగిసింది కొన్ని పాటలు మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. రెండు రోజుల క్రితం రామ్ కర్ణాటకలోని బీదర్ కి పాట చిత్రీకరణ కోసం వెళ్ళారు. ఈ చిత్ర ఆడియో ఏప్రిల్ 29 విడుదల కానుంది. కాబట్టి రామ్, తమన్నా ఈ వేడుకలో పాల్గొనడానికి త్వరలో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి తెర మీద రామ్ మరియు తమన్నాల కెమిస్ట్రి చిత్రం లో ప్రధాన ఆకర్షణ కాబోతుంది.

Exit mobile version