ఎనర్జిటిక్ హీరో రామ్ హిందీ డబ్డ్ మూవీస్ కి మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఆయన నటించిన హిందీ వర్షన్ చిత్రాలు భారీగా వ్యూస్ దక్కించుకుంటున్నాయి. కాగా 2018లో రామ్-అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు త్రినాథ రావ్ నిక్కిన తెరకెక్కించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రం హిందీలో ధమ్ దార్ కిలాడీ పేరుతో డబ్ అయ్యింది. ఆ చిత్రం ఏకంగా 200 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంటే 20 కోట్ల మంది ఆ చిత్రాన్ని యూట్యూబ్ లో చూశారన్న మాట.
ఇక రామ్ పోతినేని ప్రస్తుతం దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీ చేస్తున్నారు. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రామ్ కెరీర్ లో డ్యూయల్ రోల్ చేస్తున్న మొదటి చిత్రం ఇదే. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.