ఫోటో మూమెంట్ : ‘ఉస్తాత్ భగత్‌సింగ్’ సెట్స్‌లో శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ చేసిన పవన్

ఫోటో మూమెంట్ : ‘ఉస్తాత్ భగత్‌సింగ్’ సెట్స్‌లో శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ చేసిన పవన్

Published on Jun 20, 2025 10:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా పవన్ సరసన ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో శ్రీలీల బర్త్ డే వేడుకలు నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ వేడుకల్లో శ్రీలీల కేక్ కట్ చేసి టీమ్ సభ్యులకు పెట్టింది. ఈ వేడుకలో ఉస్తాద్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇలాంటి ఫోటోలు ఇంకా ఏమైనా ఉంటే పెట్టాలని వారు కోరుతున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు