రాజమౌళికే ఎలివేషన్ ఇచ్చిన రామ్.!

మన టాలీవుడ్ ఒక విలన్ ను ఊహించని రీతిలో ఎలివేట్ చేస్తూ తన సినిమాలో చూపించినంతగా మరో సినిమాలో చూడలేనంత పవర్ ఫుల్ గా చూపించడం ఒక్క రాజమౌళికే చెల్లుతుంది అని చెప్పాలి. కొత్త మొహం అయ్యినప్పటికీ కూడా రాజమౌళి విలనిజాన్ని ఓ రేంజ్ లో చూపిస్తారు.

మరి విలన్ కే ఆ రేంజ్ లో చూపిస్తే ఆ విలన్ కొట్టే హీరోని మరో లెవెల్లో రాజమౌళి చూపిస్తారు. అందుకే రాజమౌళిని ఈ విషయంలో మాత్రం కొట్టేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఇలాంటి రాజమౌళికే టాలీవువ్డ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు.

ఈరోజు జక్కన్న పుట్టినరోజు కావడంతో ఇండస్ట్రీ పెద్దలంతా విషెష్ తెలుపుతున్నారు. అలా రామ్ జక్కన్నకు విషెష్ తెలుపుతూ “హిట్ వస్తే కెరీర్ గ్రోత్ అవుతుంది. అదే ఈయనకు హిట్టొస్తే ఇండస్ట్రీ మొత్తం గ్రోత్ అవుతుంది” అని సింపుల్ గానే అయినా అదిరిపోయే ఎలివేషన్ కు రాజమౌళికి ఇచ్చారు. ప్రస్తుతం రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “రెడ్” థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Exit mobile version