మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలోని ప్రత్యేక పాత్ర గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ విప్లవకారుడిగా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. చరణ్ రోల్ సినిమాలో దాదాపు ఇరవై నిముషాల పాటు సినిమాలో కనిపిస్తారని సమాచారం.
ఇక మెగా వారసురాలు నీహారిక కొణిదెల కూడా ఓ ప్రత్యేక అతిధి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతుంది. లాక్ డౌన్ ముగిసిన తరువాత మొదలయ్యే షూట్ లో నిహారిక పాల్గొననుంది. అయితే, మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.