నాయక్ ఆడియో రిలీజ్ డేట్?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘నాయక్’ సినిమా ఆడియో విడుదల నవంబర్ 25న జరగనుందనే వార్తలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి. కానీ ఈ తేదీని ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. మరికొద్ది రోజుల్లో ఈ తేదీని మీడియాకి తెలియజేసే అవకాశం ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం నవంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

డిసెంబర్లోగా చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న ఈ సినిమాని 2013 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ ఆడిపాడుతున్నారు. మాస్ చిత్రాలు తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version