ఆగష్టులో గ్రీస్ వెళ్లనున్న రామ్ చరణ్


వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆగష్టులో గ్రీస్ మరియు ఐస్ ల్యాండ్ వెళ్లనున్నారు. ఈ చిత్రంలోని కొన్ని పాటలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ కోల్ కతాలో జరుగుతోంది.

ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని ఈ చిత్ర ప్రొడక్షన్ వర్గాలు చెబుతున్నాయి. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version