హరిద్వార్ లో కొత్త జంట సంక్రాంతి వేడుకలు.!

ram-charan-upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత సంవత్సరం జూన్ లో ఉపాసన కామినేనిని వివాహమాడి ఒక ఇంటివాడయ్యాడు. వీరిద్దరూ ఒకటయ్యాక వచ్చిన మొదటి సంక్రాంతి పండుగను హరిద్వార్ లో జరుపుకుంటున్నారు. అక్కడ ఆనంద్ విహార్ లో కొన్ని రోజులు గడపనున్నారు, అలాగే ఆధ్యాత్మిక మనో ఉల్లాసం కోసం కూడా అక్కడికి వెళ్ళారని సమాచారం. చరణ్ సంక్రాంతి కానుకగా తన అభిమానులకు నాయక్ సినిమాని అందించాడు. మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విజయోత్సాహంతోనే చరణ్ హరిద్వార్ వెళ్ళారు. హరిద్వార్ నుంచి తిరిగి రాగానే చరణ్ తెలుగులో చేస్తున్న ‘ఎవడు’ మరియు హిందీలో చేస్తున్న ‘జంజీర్’ సినిమా షూటింగ్స్ లో బిజీ కానున్నాడు.

Exit mobile version