రామ్ చరణ్ ట్రెండ్ మారుస్తున్నారా ?

రామ్ చరణ్ ట్రెండ్ మారుస్తున్నారా ?

Published on Mar 8, 2020 6:48 PM IST

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో ఉన్న రామ్ చరణ్ తదుపరి చిత్రంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చెర్రీ నెక్స్ట్ కూడా సుకుమార్ డైరెక్షన్లోనే సినిమా చేస్తారని మొదట్లో వార్తలు రాగా విక్రమ్ కుమార్ కూడా క్యూలో ఉన్నారనే టాక్ కూడా ఉంది. ఈ రెండూ అలా ఉండగానే కొత్తగా నూతన దర్శకుడితో చరణ్ సినిమా అంటూ వార్తలొస్తున్నాయి. ప్రదీప్ అనే కొత్త దర్శకుడికి చరణ్ ఛాన్స్ ఇస్తున్నారని, కథ చాలా ఇన్నోవెటివ్ కాన్సెప్ట్ అని టాక్.

ఇదే గనుక నిజమైతే చరణ్ కెరీర్లో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ అనుభవం ఉన్న దర్శకులతోనే చేశారు. అలాంటిది ఈసారి కొత్త దర్శకుడితో సినిమా అనగానే అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే చరణ్ క్యాంప్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు