మెగా హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. అందరూ సినిమాలతో రెడీగా ఉన్నారు. కొందరి రిలీజ్ తేదీలను కూడ ప్రకటించేశారు. మెగాస్టార్ చిరంజీవి నుండి పవన్, చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ వీళ్ళతో సినిమాను సెట్ చేసుకోవడం అంటే చాలా పెద్ద పనే. తర్వాత చేయాల్సిన రెండు మూడు సినిమాలను కూడ ఫైనల్ చేసుకుని పెట్టుకున్నారు అందరూ.
ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అడ్డాల చంటి రామ్ చరణ్ హీరోగా అనుకుని ఒక కథను రెడీ చేయించారట. కథను చరణ్ కు వినిపించారట. చరణ్ సైతం కథను మెచ్చారట. కానీ ఆయన ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో ఉన్నారు. ఈ ఏడాది చాలావరకు ఆ సినిమాతోనే గడిచిపోతుంది ఆయనకు. అందుకే ఆలస్యం ఎందుకని అదే కథను వరుణ్ తేజ్ తో చేయమని అడ్డాల చంటికి చరణ్ సలహా ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు వరుణ్ కు ఫోన్ చేసి మంచి కథ ఉంది వినమని సదరు నిర్మాతను రికమెండ్ చేశారట. ఒకవేళ ఇదే నిజమై వరుణ్ చంటి అడ్డాలతో సినిమాను ప్రకటిస్తే ఆ ప్రాజెక్ట్ సెట్ చేసిన క్రెడిట్ చరణ్ ఖాతాలోకే వెళుతుంది మరి.