తన రామరాజు రోల్ పై మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చరణ్.!

తన రామరాజు రోల్ పై మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చరణ్.!

Published on Feb 3, 2021 7:06 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ మల్టీ స్టారింగ్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రంలో ఇద్దరూ కూడా స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే..

అయితే తాను చేస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ను చరణ్ రివీల్ చేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీసు శాఖ వారి ఓ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ ఓ ప్రస్తావన వద్ద తాను మేకప్ తియ్యడానికి రెండు గంటల సమయం పట్టింది అని అందుకే లేట్ అయ్యిందని తెలిపారు.

మామూలు మేకప్ అయితే పది నిమిషాల్లో అయ్యిపోయేది కానీ అది అల్లూరి సీతారామరాజు గెటప్ మేకప్ కాబట్టి అంత సమయం పట్టిందని చెప్పడం ఒక్కసారిగా చాలా హై ఇచ్చింది. అంతే కాకుండా ఆ మేకప్ వేయడానికి గంట తియ్యడానికి గంటన్నర పడుతుంది అని చెప్పడం మరో హైలైట్ అయ్యింది. దీన్ని బట్టి జక్కన చరణ్ తో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు