త్వరలోనే రామ్ చరణ్ మరో సినిమాకి శ్రీ కారం

త్వరలోనే రామ్ చరణ్ మరో సినిమాకి శ్రీ కారం

Published on May 26, 2013 11:45 AM IST

Ram-Charan-and-Koratala-Shi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. బండ్ల గణేష్ భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని 31న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఈ సినిమాకి సంబందించిన నటీనటులు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. అలాగే ఈ సినిమా టైటిల్ మరియు టైటిల్ లోగోని ఈ సినిమా లాంచింగ్ రోజే రివీల్ చెయ్యాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

గత కొద్ది రోజులుగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించానున్నాడనే వార్తాలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ లు నటించిన ‘మిర్చి’ సినిమా తో డైరెక్టర్ గా పరిచయమైన కొరటాల శివ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మిర్చి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వడంతో రామ్ చరణ్ శివ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల శివ రెండో సినిమాతో కూడా సకేసే అందుకుంటాడని ఆశిద్దాం.

తాజా వార్తలు