పిక్ టాక్ : బీస్ట్ మోడ్‌లోకి పెద్ది.. ఎంజాయ్ చేస్తున్న చరణ్..!

Ram-Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మరోసారి మాస్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, సెట్స్ నుంచి రిలీజ్ చేసిన ఫోటోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ఛేంజ్ ఓవర్‌తో మనల్ని సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన బీస్ట్ మోడ్‌లోకి మారనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన జిమ్‌లో తెగ వర్కవుట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

సినిమాలో తన పాత్ర కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడుతున్నాడో మనకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version