పనిచేయడమే తెలుసు.. ప్రమోట్ చేసుకోవడం తెలియదు – పవన్ కళ్యాణ్

Pawan-kalayan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ప్రత్యక్షంగా ప్రమోషన్స్‌ను మొదులపెట్టాడు. తాజాగా హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు పవన్ స్వయంగా హాజరయ్యాడు. ఇక ఈ ప్రెస్ మీట్‌లో పవన్ ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు.

తనకు ఇష్టమైన నిర్మాతల్లో ఏఎం రత్నం చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. కొన్నేళ్ల క్రితమే ఆయన పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించారని పవన్ తెలిపాడు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల నలిగిపోవడం తాను చూడలేకపోయానని.. సినిమాలకు పని చేయడమే తెలుసని.. ప్రమోట్ చేసుకోవడం తనకు తెలియదని.. కానీ, ఈ సినిమా కోసం రత్నం పడుతున్న కష్టాన్ని చూసి తాను ఈ చిత్ర ప్రమోషన్స్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపాడు.

ఇక తాను నటించిన సినిమాను అనాధగా వదలేశానని అనిపించింది.. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ను తన భుజాలపై వేసుకున్న తీరు తనను ఆకట్టుకుందని.. సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తి తాను.. అలాంటిది తన సినిమాను ఒంటరిగా ఎలా వదిలేస్తానని చెప్పేందుకే ఈ ప్రెస్ మీట్‌కు వచ్చానని పవన్ అన్నాడు.

ఏఎం రత్నం అంటే తనకు ఎంత ఇష్టమంటే, ఆయన కోసం ఈ సినిమాకు ఏదో ఒకటి చేయాలని భావించి క్లైమాక్స్ ఎపిసోడ్‌ను తానే యాక్షన్ కిరయోగ్రాఫ్ చేశానని పవన్ పేర్కొన్నాడు. ఇక ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటే ఏఎం రత్నం లాంటి నిర్మాతలు నిలదొక్కుకోవాలని.. అందుకోసం వారి పక్కన నిలబడేందుకు తాను సిద్ధమంటూ పవన్ కామెంట్ చేశాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వీరమల్లు ప్రెస్ మీట్‌కు రావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు మరింత ఊపు వచ్చిందని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరి చూపులు ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై పడింది.

Exit mobile version