వైరల్ కటౌట్స్: ‘వీరమల్లు’ పక్కనే జూనియర్ పవర్ స్టార్

HHVM Movie

ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా సౌత్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు మేనియా మొదలైంది. పలు ప్రాంతాల్లో పవన్ కటౌట్స్ తో నిన్నటి నుంచే మంచి కోలాహలం మొదలైంది. ఇక వీటితో పాటుగా బెంగళూరులో కూడా అభిమానులు సందడి మొదలు పెట్టగా అక్కడ పవన్ వీరమల్లు కటౌట్ పక్కనే మరో కటౌట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మరి ఆ కటౌట్ ఎవరిదో కాదు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ ది. దీనితో ఇద్దరూ కటౌట్స్ కలిపి కనిపించిన ఫ్రేమ్ సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. ఇక అకిరా ఎంట్రీ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇది జరగాలి అంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక వీరమల్లు సినిమా ఈ జూలై 24న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది.

Exit mobile version