టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన నటించే సినిమాల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగాలని అభిమానులు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అలాంటిది మహేష్ బాబు క్రేజ్‌కు ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.
మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. తాజాగా శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్ నుంచి కొలంబోకి మహేష్ బాబు ప్రయాణించాడు. తమ విమానంలో సౌత్ ఇండియా సినిమా ఐకాన్ ప్రయాణిస్తున్నారని తెలుసుకుని ఆ విమానయాన ఉద్యోగులు మహేష్‌తో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోను సదరు ఎయిర్‌లైన్స్ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో మహేష్ బాబు అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో ఇరగదీశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.