ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా ‘హరిహర వీరమల్లు’ మారింది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
ఇక ఈ ప్రెస్ మీట్‌లో పవన్ లుక్స్ అందరినీ అట్రాక్ట్ చేశాయి. ఆయన స్లిమ్ లుక్‌లో ఛార్మింగ్‌గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ లుక్స్ ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో కనిపిస్తుంది. దీంతో ఆయన లుక్స్‌ను ఇంతలా తీర్చిదిద్దిన హరీష్ శంకర్‌ను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తమ అభిమాన హీరోను ఇలాంటి లుక్స్‌లో చూపెట్టినందుకు హరీష్ శంకర్‌కు వారు సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెబుతున్నారు. దీనికి ఆయన కూడా రిప్లై ఇస్తూ.. పవన్ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం అంటూ కామెంట్ చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.