రామ్ చరణ్ అఫీషియల్ పేస్ బుక్ పేజ్ ఒక మైలురాయిని అందుకుంది. ఈ నెట్వర్కింగ్ సైట్ ఫాలొవర్ల సంఖ్య 1 మిలియన్ కు చేరింది. రామ్ చరణ్ తన ఎవడు విశేషాలను, వ్యక్తిగత విషయాలను ఈ మధ్య తరచుగా పోస్ట్ చేస్తున్నాడు
ఎవడు సినిమాకు మనరాష్ట్రంలో తిరుగు లేకుండా పోయింది. ఇదే ఊపుతొ కొనసాగితే చాలా రికార్డులను ఈ సినిమా బద్ధలుకొడుతుంది. వంశీ పైడిపల్లి, దిల్ రాజు, సాయి కుమార్ మరియు శశాంక్ పలు ప్రాంతాలలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అక్కడ అభిమానుల ఉత్సాహంతో ఆనందంలో వున్నారు
శృతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ తళుక్కున మెరిసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు