రామ్ చరణ్ కి బాబాయ్ గా శ్రీ కాంత్..!

రామ్ చరణ్ కి బాబాయ్ గా శ్రీ కాంత్..!

Published on Jan 19, 2014 1:02 PM IST

Ram-Charan-and-Srikanth
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి మనకు తెలిసిందే. మొదటగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ని ఓ ప్రముఖ పాత్ర కోసం అనుకున్నారు కానీ అది కార్య రూపం దాల్చలేదు. చివరికి ఆ పాత్ర కోసం శ్రీ కాంత్ ని ఫైనలైజ్ చేసారు. శ్రీ కాంత్ ఈ మూవీలో రామ్ చరణ్ కి బాబాయ్ గా కనిపించనున్నాడు.

ఈ చిత్ర టీం గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం లోకేషన్స్ వేటలో ఉన్నారు. లోకేషన్స్ వేట ముగిసింది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నెల 26 నుంచి ఈ సినిమా కోసం నానక్రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో ఓ భారీ సెట్ వేయనున్నారు. రామ్ చరణ్ సరసన మూడోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు