రాజమౌళి ఛాలెంజ్ పూర్తి చేసిన చరణ్ !

రాజమౌళి చేసిన ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్ ను చరణ్ పూర్తి చేశాడు. తనలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తూ.. ఇంటి పని, వంట పని చేసి, త్రివిక్రమ్, రానా, రణ్ వీర్ సింగ్, శర్వానంద్ చేత కూడా ఇంటి పని చేయించబోతున్నాడు.

రాజమౌళి సవాల్‌ను స్వీకరించిన చరణ్ .. ‘బట్టలు వాష్ చేయడంతో పాటు.. అలాగే నేలమీద క్లీన్ కూడా చేశాడు, మొక్కలకు నీళ్లు పోశాడు, తన సతీమణికి కాపీ పెట్టి ఇచ్చాడు. ఇవ్వన్నీ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేస్తూ త్రివిక్రమ్, రానా, రణ్ వీర్ సింగ్, శర్వానంద్ లకు ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్ విసిరాడు.

కాగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘బీ ద రియల్‌ మెన్‌’ పేరుతో రాజమౌళికి ఛాలెంజ్‌ చేయటం, సందీప్ సవాల్‌ను స్వీకరించిన రాజమౌళి, తాను ఇంటి పనిని చేసి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకి మరియు ఎం. ఎం. కీరవాణి అలాగే డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఛాలెంజ్‌ విసరడం, ఎన్టీఆర్ చరణ్ లు తమ పని పూర్తి చేసి మిగిలిన స్టార్స్ కి ఛాలెంజ్ చేయడంతో ఇప్పుడు ఇది వరుసగా కంటిన్యూ అవుతుంది.

Exit mobile version