మల్టీ స్టారర్ సినిమాకి డబ్బింగ్ స్టార్ట్ చేసిన రామ్

మల్టీ స్టారర్ సినిమాకి డబ్బింగ్ స్టార్ట్ చేసిన రామ్

Published on Aug 14, 2013 3:45 PM IST

Ram

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాకి డబ్బింగ్ ప్రారంభం అయ్యింది. ‘బోల్ బచ్చన్’ సినిమాకి రిమేక్ గా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘మసాల’. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఈ సినిమా డబ్బింగ్ మొదలుపెట్టాను . ఇలా సినిమా చూస్తూ నేను నవ్వను. ఇలా సినిమా చూసి నవ్వి చాలా రోజులైంది. ఈ సినిమా చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకు ఉంది’ అని రామ్ ట్వీట్ చేశాడు. సరస్వతి రవికిషోర్ – దగ్గుపాటి సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, షాజహా పదమ్సీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారం త్వరలో తెలియజేస్తాం.

తాజా వార్తలు