మెగా ఛాన్స్ కొట్టేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కీలక టీం

SaailuKaampati

లేటెస్ట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రమే రాజు వెడ్స్ రాంబాయి. నిజమైన సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ఆడియెన్స్ ని మెప్పించి సాలిడ్ వసూళ్లు అందుకుంటుంది. అయితే ఈ సినిమా సక్సెస్ వేడుకల్లో మెగా డైరెక్టర్ కొల్లి బాబీ హాజరు కావడం జరిగింది.

అయితే ఈ ఈవెంట్ లో తను తన నెక్స్ట్ సినిమా మెగాస్టార్ తో చేయనున్న ప్రాజెక్ట్ లో రాజు వెడ్స్ రాంబాయి సాహిత్య రచయితకు అలాగే దర్శకుడు బోస్ కి అవకాశం ఇస్తున్నట్టు మెగా ఆఫర్ అందించారు. దర్శకుడు బోస్ మెగాస్టార్ తో సీన్ లో నటించాలని కోరితే వెంటనే దర్శకుడు ఆనందంతో ఒప్పుకున్న దృశ్యాలు ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారాయి. సో ఇలా రాజు వెడ్స్ రాంబాయి కీలక మెంబర్స్ మెగాస్టార్ 158వ సినిమాకి లక్కీ ఛాన్స్ కొట్టేసారని చెప్పవచ్చు.

Exit mobile version