తెలుగు సినిమా దగ్గర సంక్రాంతి క్లాష్ అనేది బాక్సాఫీస్ దగ్గర ఒక బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పాలి. ఎన్నో సినిమాలు ఇదే టైం లో వచ్చి ఆడియెన్స్ ని అలరించి క్యాష్ చేసుకోవాలని చూస్తారు. అలానే 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ కి పలు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా కలిపి మొత్తం 6 సినిమాలు ఈ రేస్ లో ఉంటే ఈ అన్ని సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకోలేదు.
డబ్బింగ్ చిత్రాలు జన నాయకుడు, పరాశక్తి డేట్స్ తెచ్చేసుకున్నాయి. అలాగే ది రాజా సాబ్ జనవరి 9 కాదు 8 నుంచే సంక్రాంతి రేస్ ని మొదలు పెట్టబోతోంది. ఇక ఈ తర్వాత అనగనగా ఒక రాజు కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది. మరి ఈ సినిమా కాకుండా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు డేట్ విషయంలో పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమా అప్డేట్స్ వస్తున్నాయి కానీ డేట్ ఇంకా రాలేదు.
ఇక ఈ సినిమానే కాకుండా రవితేజ నటించిన భర్త మహాశయులకు కూడా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలోనే ఉంచాలనే మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమా కాకుండా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా ఉంది. దీనిపై కూడా క్లారిటీ లేదు. మెయిన్ గా ఏ సినిమాకి ఏ డేట్ లో రావాలి అనేదే పెద్ద ఛాలెంజ్ గా మారినట్టు తెలుస్తుంది.
ఒకే రోజు రెండు సినిమాలు వస్తే అది డెఫినెట్ గా థియేటర్స్ పరంగా రెండు సినిమాలకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ డేట్స్ తో పాటుగా అన్ని సినిమాలకి థియేటర్స్ సర్దుబాటు కూడా మరో పెద్ద ఛాలెంజ్. సో అందుకే మేకర్స్ కూడా ఈ డేట్స్ విషయంలో వెంటనే ఒక కొలిక్కి రాలేకపోతున్నారట. దీనితో సంక్రాంతి 2026 క్లాష్ మాత్రం మరింత రసవత్తరంగా మారుతుంది అని చెప్పాలి.
