“అఖండ 2”: అక్కడ బాలయ్య ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!?

Akhanda 2

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమానే అఖండ 2 తాండవం. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన కంటెంట్ అంతా మంచి రెస్పాన్స్ అందుకోగా మేకర్స్ ఈ సినిమాని 3డి లో కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం.

అయితే ఈ 3డి రిలీజ్ షో యూఎస్ మార్కెట్ లో కొంచెం ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. అక్కడ అఖండ 2 మొదటగా 2డి వెర్షన్ లో మాత్రమే ప్రీమియర్స్ పడనున్నాయ్ అని తెలుస్తోంది. సో 3డి లో ప్రీమియర్స్ చూద్దాం అనుకున్న వారికి ఇది డిజప్పాయింట్ చేసే న్యూస్ అనే చెప్పాలి.

ఒకరోజు ఆలస్యంగా అక్కడ 3డి షోస్ పడనున్నాయట. సో ముందు 2డి లో ఎంజాయ్ చెయ్యాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతోంది.

Exit mobile version