తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నాని ‘HIT-3’ లో చేసిన అతని కెమియో తర్వాత, HIT 4లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో కార్తీ నటించిన వా వాతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) డిసెంబర్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. నలన్ కుమరసామి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
అయితే, ఇప్పుడు మరో టాలీవుడ్ దర్శకుడితో కార్తీ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ‘మ్యాడ్’ ఫ్రాంచైజీకి దర్శకుడు అయిన కల్యాణ్ శంకర్, కార్తీతో ఒక కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన రవితేజతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే కార్తీ మరో టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
