టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హను మాన్’ చిత్రంతో ఒక్కసారిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఆ తర్వాత ఆయనతో సినిమాలు చేసేందుకు డిమాండ్ పెరిగింది. అయితే, ఆయన ఇప్పటికే పలు సినిమాలను ప్రకటించారు కూడా. కాగా తాజాగా గోవాలో జరిగిన IFFI ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకే రిలీజ్ డేట్స్‌పై పట్టు లేకపోవడంతో తన సినిమాల రిలీజ్ డేట్‌ను తానే నిర్ణయించే షరతు ఒప్పందాల్లో పెట్టుకుంటానని ఆయన తెలిపారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాలకు కావాల్సినంత సమయం ఇస్తే ఔట్ పుట్ సరిగ్గా వస్తుందని ఆయన తెలిపారు.
తన తొలి సినిమాలలో ఎదురైన చేదు అనుభవాల వల్లనే ఇప్పుడు తాను క్లియర్‌గా ఉన్నాడని.. అందుకే సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ తానే నిర్ణయిస్తాడని నిర్మాతల ముందు షరతు పెడుతున్నాడట. వాస్తవానికి ఇలా చేస్తే దర్శకుడు తాను ఏదైతే సినిమా తీయాలనుకుంటున్నాడో దానిని పక్కాగా ప్రజెంట్ చేసే ఆస్కారం ఉంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
