పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ప్రభాస్ తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు మారుతి పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కించాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో తన పాత్రపై హీరోయిన్ మాళవిక మోహనన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఆమె ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఓ పక్కా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపింది. కొందరు హీరోయిన్లకు ఇలాంటి సినిమాల్లో కేవలం గ్లామర్ కోసమో.. లేదంటే ఓ పవర్‌ఫుల్ రోల్ ఇచ్చి ముగించేయడమో చేస్తారు.. కానీ, తనకు ఈ సినిమాలో అటు గ్లామర్, ఇటు పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఉన్న పాత్ర లభించిందని.. తనకు ఇది చాలా బాగా నచ్చిందని ఆమె పేర్కొంది.
ఇక ఈ సినిమాలో మిగతా ఇద్దరు హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు దక్కాయని ఆమె పేర్కొంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీ.జీ.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


