అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డలు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. కాగా ఈ చిత్రం 2వ రోజు మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. మౌత్ టాక్ తో పాటు తక్కువ టికెట్ ధరలు కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా భారతదేశం అంతటా కేవలం రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 4.04 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి ఈ సినిమా విజయంతో మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
ముఖ్యంగా ఎలాంటి స్టార్ వాల్యూ లేకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ ను సాధించడం నిజంగా విశేషమే. ఎలాగూ 3వ రోజు (ఈ రోజు ఆదివారం) కాబట్టి కలెక్షన్లు ఖచ్చితంగా బాగుంటాయి. అన్నట్టు ఈ సినిమా ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల మరియు రాహుల్ మోపిదేవి నిర్మించారు, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో సురేష్ బొబ్బిలి సంగీతం ముఖ్య పాత్ర పోషించింది.


