ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా ఓపెనింగ్ కి మెగాస్టార్!

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా ఓపెనింగ్ కి మెగాస్టార్!

Published on Nov 23, 2025 2:01 PM IST


రీసెంట్ గా అనౌన్సమెంట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేసిన కొన్ని చిత్రాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ప్రభాస్ ని ప్రెజెంట్ చేస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఒకటి. అయితే ఈ అవైటెడ్ పాన్ ఆసియ సినిమాపై ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. సందీప్ వంగ డెమీ గాడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు ప్రభాస్ సినిమా గ్రాండ్ గా ఓపెనింగ్ అయ్యింది.

నేడు అట్టహాసంగా సందీప్ ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఇక ఈ సినిమాని మెగాస్టార్, బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టి ఆరంభించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ లాంచ్ లో చిత్ర యూనిట్ సహా త్రిప్తి డిమ్రి కూడా హాజరైంది. మొత్తానికి మాత్రం ఈ ఆదివారం ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో కిక్ ఇచ్చే న్యూస్ ఇది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు