ఆంధ్ర కింగ్ తాలూకా.. కెరీర్‌లో గర్వంగా చేసిన సినిమా!

ఆంధ్ర కింగ్ తాలూకా.. కెరీర్‌లో గర్వంగా చేసిన సినిమా!

Published on Nov 23, 2025 3:00 AM IST

రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌ను విశాఖపట్నంలో నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో రామ్ స్వయంగా పాటలు పాడి అభిమానులను అలరించాడు. వివేక్-మెర్విన్‌తో కలిసి స్టేజ్‌పై రామ్ పాడటం ఈ ఈవెంట్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఫ్యాన్ పాత్ర పోషించిన తర్వాత, ఆ పాత్ర కోరుకున్న ప్రతిదానిని పూర్తిగా ఇచ్చారని తనకు అనిపించిందని రామ్ తెలిపారు.

ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత గర్వకారణమైన సినిమాగా నిలిచిపోతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ఇంత అందంగా రావడానికి మొత్తం టీమ్ పెట్టిన కష్టమే కారణమని తెలిపాడు. భాగ్యశ్రీని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినప్పుడు ఈ చిత్రంలో ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందా అని భావించానని.. అయితే, తన నటనతో ఆమె ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని రామ్ అన్నాడు.

తాజా వార్తలు